: 'జేమ్స్ బాండ్' సహచరి మోలీ పీటర్స్ కన్నుమూత!


ఇటీవలే జేమ్స్ బాండ్ హీరో రోగర్ మూర్ 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇంతలోనే బాండ్ హీరోయిన్ మోలీ పీటర్స్ కూడా కన్నుమూశారు. ఆమె మృతిని జేమ్స్ బాండ్ అధికారిక ట్విట్టర్ పేజ్ ధ్రువీకరించింది. ఆమె కుటుంబానికి సంతాపం తెలిపింది. 75 ఏళ్ల మోలీ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 1965లో వచ్చిన బాండ్ మూవీ 'థండర్ బాల్'లో షాన్ కానరీ సరసన మోలీ నటించింది. 1942లో ఇంగ్లండ్ లోని ఓ మారుమూల గ్రామంలో ఆమె జన్మించింది. మోడల్ గా కెరియర్ ను ప్రారంభించిన ఆమె... పరేడ్, ప్లేబోయ్ లాంటి మేగజీన్లలో కనిపించింది. బాండ్ డైరెక్టర్ టెరెన్స్ యంగ్ ఆమెను గుర్తించి... 23 ఏళ్ల వయసులో ఆమెకు తన చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె పలు చిత్రాలు, టీవీ షోలలో కనిపించి ప్రేక్షకులను మైమరపించింది. 

  • Loading...

More Telugu News