: సుఖోయ్-30 యుద్ధ విమానంలోని ఇద్దరు పైలెట్ల మరణం.. అధికారిక ప్రకటన


అరుణాచల్ ప్రదేశ్, అసోం సరిహద్దుల్లో గత వారం కూలిపోయిన భారత వాయుసేన విమానంలోని ఇద్దరు పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ డీ ఎంకజ్, ఫ్లయిట్ లెఫ్టినెంట్ సచుదేవ్ లు తీవ్రగాయాలు, మంటల కారణంగా మరణించారని అధికారిక ప్రకటన వెలువడింది. విమానం కుప్పకూలే సమయంలో వీరు తమ సీట్ల నుంచి ఎజెక్ట్ కాలేకపోయారని, విమానంలోని ఎఫ్డీఆర్ (ఫ్లయిట్ డేటా రికార్డర్), ఘటనా స్థలిలో లభ్యమైన పలు ఇతర వస్తువులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వాయుసేన అధికారి ఒకరు తెలిపారు.

తీవ్ర గాయాల కారణంగా సుఖోయ్-30 ఫైటర్ జెట్ పైలట్లు మరణించారని ఆయన అన్నారు. కాగా, ఈ విమానం గత నెల 23న ఉదయం 10:30 గంటల సమయంలో టేకాఫ్ కాగా, ఆపై 40 నిమిషాలకు అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆపై 26వ తేదీన విమానం శకలాలను తేజ్ పూర్ కు 60 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవుల్లో కనుగొన్నారు. ఆదివారం నాడు విమానంలోని బ్లాక్ బాక్స్ జాడ తెలిసినప్పటికీ, అందులో పైలట్ల గురించిన సమాచారం లభ్యం కాలేదన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News