: మ్యాక్సిమ్ హాట్ 100 వుమెన్ జాబితాలో స్థానం సంపాదించిన ప్రియాంక, దీపికా


అందం, అభినయంతో బాలీవుడ్ ను అలరించి హాలీవుడ్‌ లో కాలుపెట్టిన ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునేలు ప్రముఖ మ్యాగజీన్ మాక్సిమ్‌ రూపొందించిన ‘100 హాట్‌ వుమెన్‌-2017’ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. క్వాంటికో టీవీ సిరీస్ లో నటించి, అమెరికన్ ప్రేక్షకులను అలరించిన ప్రియాంకా చోప్రా... బేవాచ్ సినిమాతో హాలీవుడ్ లో పూర్తి స్థాయిలో ప్రవేశించింది. అనంతరం ‘ట్రిప్లెక్స్‌’ సినిమాతో దీపికా పదుకునే హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఊహించిన విజయం సాధించలేదు.

అయితే నటీమణులుగా హాలీవుడ్ హీరోలు, దర్శకుల మనసులు వీరు గెలుచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హద్దులు చెరిపేసి, తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకున్న అందాల భామలు అంటూ ప్రముఖ మేగజీన్ మాక్సిమ్ ఒక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 100 మంది అందాల భామలు ఉన్నారు. వారిలో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునే కూడా స్థానం సంపాదించడం వారి అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, ఈ జాబితాలో అమెరికన్‌ సూపర్‌ మోడల్‌ హేలీ బాల్డ్విన్‌, హాలీవుడ్‌ ప్రముఖ అందాల తారలు ఎమ్మా వాట్సన్‌, ఎమ్మా స్టోన్‌, డకోటా జాన్సన్‌, కెండల్‌ జెన్నర్‌ తదితరులున్నారు. 

  • Loading...

More Telugu News