: ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు కోటీ 45 లక్షలు మరి!


బ్రాండెడ్ దుస్తులు, డిజైనర్ వేర్ ధరించడం స్టేటస్ సింబల్. సెలబ్రిటీ సొసైటీలో ఎంత ఆడంబరంగా ఉంటే అంత గొప్ప... దీంతో సంపదను ప్రదర్శించేందుకు ఖరీదైన వస్తువుల వినియోగం ఎక్కువైంది. తాజాగా క్రిస్టీస్ సంస్థ హెర్మెస్ బిర్కన్ సంస్థ 2014లో తయారు చేసిన ఒక లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ను 1.45 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ఔత్సాహికుడు కొనుగోలు చేయడం విశేషం. దీంతో ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రపంచంలో అత్యధిక ధర కలిగిన హ్యాండ్ బ్యాగ్ గా రికార్డులకెక్కింది.

ఈ బ్యాగును అరుదైన ‘హిమాలయ’ జాతి మొసలి చర్మంతో హెర్మెస్ బిర్కన్ సంస్థ తయారు చేసింది. ఈ బ్యాగ్ బకెల్స్ ను 18 క్యారట్ల బంగారంతో చేశారు. వాటికి వినియోగించిన నాడాలకు 205 వజ్రాలు పొదిగారు. ఇన్ని విశేషాలు కలిగిన ఈ హ్యాండ్ బ్యాగ్ ను క్రిస్టీస్ సంస్థ హాంగ్ కాంగ్ లో వేలం వేయగా, గుర్తు తెలియని వ్యక్తి దానిని 1.45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. 

  • Loading...

More Telugu News