: రాహుల్ వస్తున్నారు... మువ్వన్నెలతో ముస్తాబైన భాగ్యనగరి!


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రానున్న తరుణంలో టీఎస్ పీసీసీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరమంతటినీ మువ్వన్నెల జెండాలతో అలంకరించారు. ప్రతి కూడలిలో కాంగ్రెస్ జెండాలు, రాహుల్ కు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు ఏర్పాటయ్యాయి. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధికారికంగా ప్రభుత్వం నిర్వహించనుండగా, రాష్ట్రాన్ని ఇచ్చింది తామేనన్న నినాదంతో కాంగ్రెస్ నేడు పోటీగా అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, నేడు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభను తలపెట్టగా, దానికి ముఖ్య అతిథిగా రాహుల్ హాజరు కానున్నారు. ఇక ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే రాహుల్, ఆ వెంటనే సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఆపై ర్యాలీగా బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సంగారెడ్డి చేరుకుంటారు.

  • Loading...

More Telugu News