: విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాం..!: సన్నీలియోన్
తాము విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని బాలీవుడ్ నటి సన్నీలియోన్ తెలిపింది. తాము ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నామని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. తాము ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం వాతావరణం అనుకూలించని కారణంగా ప్రమాదానికి గురి కాబోయిందని ఆమె చెప్పింది. తమ పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తమను రక్షించాడని తెలిపింది. తాము మహారాష్ట్రలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్నామని, ఇంటికి వెళుతున్నామని ఆమె ఈ సెల్ఫీ వీడియో తీస్తున్న సమయంలో చెప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారులో తన స్నేహితులు, భర్త డేనియల్ కూడా ఉన్నారు. వారు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
Thank the lord we are all alive! Our private plane almost crashed through bad weather. Counting our stars and driving home! Thank you God! pic.twitter.com/9jhTQ1arHX
— Sunny Leone (@SunnyLeone) May 31, 2017