: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్‌రెడ్డి!


తెలంగాణ అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తూ టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ రోజు ఓ బ‌హిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లో తెలంగాణ‌ అమరుల స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని ఆయ‌న పేర్కొన్నారు. మొత్తం 1,569 మంది అమరుల కుటుంబ వివరాలను సేకరించ‌డానికి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయాల‌ని ఆయ‌న అన్నారు.

తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాల‌ని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంతేగాక‌, వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, వ్యవసాయ భూమి అంద‌జేయాల‌ని అన్నారు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ఆత్మార్పణ చేసిన డిసెంబర్ 3ను తెలంగాణ ప్ర‌భుత్వం అమరుల దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.                      

  • Loading...

More Telugu News