: సోపోర్‌లో పోలీసు బృందంపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి.. నలుగురు పోలీసులకు గాయాలు
దేశంలో ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘావర్గాలు హెచ్చరిస్తున్న వేళ ఈ రోజు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు పోలీసులపై దాడికి దిగడం కలకలం రేపింది. ఆ రాష్ట్రంలోని సోపోర్ లో ఉగ్రవాదులు పోలీసుల బృందంపైకి గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అక్కడి భద్రతా సిబ్బంది పోలీసులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు.