: జూనియర్ ముక్కు అచ్చం నాని ముక్కులానే ఉంది: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ యంగ్ హీరో నాని నిన్న తన ట్విట్టర్ ఖాతాలో మొదటిసారిగా పోస్ట్ చేసిన తన కుమారుడు అర్జున్ ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆయన పోస్ట్ చేసిన ఈ ఫొటోపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ నాని బుల్లి కొడుకుని తెగపొగిడేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో నాని కుమారుడు అర్జున్ ‘జూనియర్ నాని’గా ఫేమస్ అయిపోతున్నాడు.
మరో నేచురల్ స్టార్ పుట్టేశాడని, నాని 2.0 అని ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ ఫొటోపై ఇప్పటికే సమంత స్పందించి 'సో సో లవ్లీ' అని ట్వీట్ చేయగా, తాజాగా మరో టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా జూనియర్ నానిని చూసి సంబరపడిపోయింది. నాని కుమారుడు ఎంతో ముద్దొస్తున్నాడని ఆమె కామెంట్ చేసింది. ఇంకా జూనియర్ నాని ముక్కు హీరో నానిలాగే ఉందని పేర్కొంది.
naniiiiiii he is adorable