: మరో వివాదంలో తహసీల్దార్ వనజాక్షి


కృష్ణా జిల్లా నూజివీడు తహసీల్దార్ వనజాక్షి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ముక్కుళ్లపాడులో 44 రేషన్ కార్డులను తొలగించారంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే ఈ రేషన్ కార్డులను తొలగించారంటూ ఆమెపై టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై వనజాక్షి స్పందించారు. ఈ 44 రేషన్ కార్డుల యజమానులంతా ఉన్నత కుటుంబాలకు చెందినవారేనని ఆమె చెప్పారు. కావాలని తాను ఏ పనీ చేయలేదని తెలిపారు. అంతేకాదు, నిజనిర్ధారణ కోసం ఈ 44 రేషన్ కార్డులకు సంబంధించి... బహిరంగ విచారణ జరిపారామె.

  • Loading...

More Telugu News