: ఫేస్‌బుక్‌లో లైక్ కొట్టినందుకు ఓ యూజర్ కి రూ. 2.58 లక్షల ఫైన్ వేసిన కోర్టు!


ఫేస్‌బుక్‌లో కొంద‌రు చేసిన కామెంట్ల‌కి లైక్ కొట్టి‌నందుకు గానూ ఓ యూజ‌ర్ ఏకంగా రెండున్నర లక్షల రూపాయల ఫైన్‌ కట్టుకోవాల్సిన ఘ‌ట‌న‌ స్విట్జర్లాండ్‌లో చోటుచేసుకుంది. ఫేస్‌బుక్‌లో జంతువుల హక్కుల గ్రూపు నడిపిస్తున్న ఎర్విన్ కెస్లర్ అనే వ్యక్తి ఇటీవ‌ల ఓ పోస్ట్ చేశాడు. అయితే, ఆ పోస్టు మీద‌ కొంతమంది వివక్షాపూరితమైన కామెంట్లు చేశారు. ఇటువంటి కామెంట్ల‌కి లైక్ కొట్టేవారు ఎవ‌రూ లేర‌న్న‌ట్లుగా ఓ యూజ‌ర్ ఏదో గొప్ప ప‌ని చేస్తున్న‌ట్లు లైక్ కొట్టేశాడు. దీంతో ఎర్విన్ కెస్లర్ ఆ కామెంట్ల‌కి లైక్‌కొట్టిన వ్య‌క్తిపై కేసు వేశాడు. కోర్టులో విచార‌ణ జ‌రిగిన త‌రువాత ఆ కామెంట్లు, లైకుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ జడ్జి.. లైక్ చేయడం ద్వారా ఆ వివక్షాపూరిత వ్యాఖ్యలను సమర్థించినట్లు అయిందని పేర్కొని, ఇలా ఫైన్ విధించారు. అంతేకాదు ఆ కామెంట్లు చేసిన ఇత‌రుల‌ను కూడా కోర్టు దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News