: భారత్ తన 'కొడుకు'తో మ్యాచ్ ఆడేముందు 'మనవడి'తో సాధన చేస్తోంది: సెహ్వాగ్ పంచ్ డైలాగులు
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో నిన్న లండన్‌లో భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌కు కామెంటరీ చేసిన టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్థాన్‌పై భలే పంచ్‌లు వేసేశాడు. ఒకప్పుడు ఒకే దేశంగా ఉన్న భారత్, పాక్, బంగ్లాదేశ్‌లు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్నాయి. నిన్న బంగ్లాను భారత్ చిత్తు చేసేస్తోన్న సందర్భంలో సెహ్వాగ్ ఈ పంచ్‌లు వేశాడు.
భారత్ తన కొడుకుతో మ్యాచ్ ఆడేముందు మనవడితో సాధన చేస్తోందని చురకలు అంటించాడు. దీంతో ఇతర వ్యాఖ్యాతలంతా విరగబడి నవ్వారు. పాకిస్థాన్ తో టీమిండియా వచ్చేనెల 4న తన తొలి మ్యాచ్ ఆడనుంది. పాక్‌ను భారత్ కొడుకుగా, బంగ్లాదేశ్‌ను మనువడిగా పోల్చిన సెహ్వాగ్ టైమింగ్ అదుర్స్ అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.