: 'బాహుబలి' రికార్డులను బద్దలు కొట్టేందుకు భారీ ప్లాన్ వేస్తున్న డైరెక్టర్ శంకర్


దక్షిణ భారత సినీ పరిశ్రమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిన సినిమా 'బాహుబలి'. ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్ లో సైతం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టేందుకు తమిళ దర్శకుడు శంకర్ సిద్ధమవుతున్నాడు. రజనీకాంత్ తో నిర్మించిన రోబో సీక్వెల్ '2.0' సినిమాను బంపర్ హిట్ చేసేందుకు తన యూనిట్ సభ్యులతో కలసి రకరకాల ప్లాన్ లు వేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏకంగా 15 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. అయితే, ముందుగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను రూ. 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటించడంతో... సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

  • Loading...

More Telugu News