: ఇకపై సమస్యలను భుజాన వేసుకునేందుకు మోహన్ బాబు ఉన్నారు: నాగబాబు
దాసరి నారాయణరావు మృతితో ఏర్పడిన లోటు ఎవరూ తీర్చలేనిదని, అయినప్పటికీ, చిత్ర పరిశ్రమలో వచ్చే సమస్యలను భుజాన వేసుకుని వాటిని పరిష్కరించేందుకు మోహన్ బాబు వంటి పెద్దలు ఉన్నారని నటుడు, చిరంజీవి సోదరుడు నాగబాబు వ్యాఖ్యానించారు. "ఆయన ఉన్నంత కాలమూ ఆ లోటు తెలియనివ్వలా. నెక్ట్స్ ఎవరుంటారు? ఆయన వారసుడిగా, ఆయనలా సమస్యలను భుజాన వేసుకుని, సొంత పనులను కూడా వదులుకుని, సమస్యలను సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చే మంచి మనిషి ఆయన. ఆయన ఆశీర్వాదంతో మరో మంచి మనిషి ముందుకొస్తాడు. ఇప్పుడు కూడా ఉన్నారు మన పెద్దలు. మోహన్ బాబు వంటి వ్యక్తులున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలి. రాఘవేంద్రరావు వంటి వారు ఉన్నారు. ఇండస్ట్రీకి పెద్ద తల అంటారా? నాయకుడని అంటారా? పెద్ద దిక్కంటారా? నాకు వ్యక్తిగతంగా నేను నా సమస్యలతో ఆయన వద్దకు వెళ్లలేదు గానీ, చాలా మంది నావంటి వారు పరిష్కరించలేని సమస్యలను ఆయన అవలీలగా సాల్వ్ చేసి ఎంతో మందికి సాయపడ్డారు" అని చెప్పారు.