: నన్ను మాట్లాడించవద్దు: ట్విట్టర్ లో మంచు లక్ష్మి వేడుకోలు


దాసరి నారాయణరావు మరణంతో 'మంచు' కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోను కాగా, పదే పదే తనను స్పందించాలని కోరుతున్న మీడియాకు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఓ అభ్యర్థన చేసింది. తానిప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేనని, దయచేసి స్పందించాలని తనను అడగవద్దని వేడుకుంది. రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తున్న ఓ ఎమోజీని ఉంచింది. దాసరి ఓ శక్తని, అడిగిన వారికి కాదనకుండా సాయం చేసిన మహోన్నతుడని, తమ కుటుంబానికి ఆయన మరణం తీరని లోటని చెబుతూ, మంచు మనోజ్ పసిపాపగా ఉన్నప్పుడు దాసరి ఎత్తుకుని ఒళ్లో పెట్టుకుని ఉన్న ఓ చిత్రాన్ని షేర్ చేసుకుంది.

  • Loading...

More Telugu News