: మొదలైన దాసరి అంతిమ యాత్ర... వేలాదిగా తరలి వెళుతున్న సినీ ప్రముఖులు!


ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అంతిమ యాత్ర ప్రారంభమైంది. హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో నిన్న సాయంత్రం ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నిన్న సాయంత్రం నుంచి దాసరి నివాసానికి వచ్చి నివాళులర్పించారు. ఉదయం పదిన్నరకు ఆయన పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, అభిమానులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, సంతాపం తెలిపారు. అనంతరం 12:45 నిమిషాలకు ఫిల్మ్ ఛాంబర్ నుంచి మొయినాబాద్ లోని తమ ఫాం హౌస్ లో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. నేటి సాయంత్రం ప్రభుత్వం లాంఛనాలతో దాసరి అంత్యక్రియలు పూర్తికానున్నాయి. 

  • Loading...

More Telugu News