: ఇండియాకు వచ్చి దేశవాళీ క్రికెట్ ఆడుకో: రహానేపై అభిమానుల ఆగ్రహం


ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాక్టీస్ మ్యాచ్ లలో విఫలమవుతున్న టీమిండియా బ్యాట్స్ మెన్ రహానేపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ లలోనూ రహానే ఫెయిల్ అయ్యాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి నిరాశపరిచాడు. నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా బ్యాట్ ఎత్తేశాడు. ముస్తాఫిజర్ బౌలింగ్ లో డ్రైవ్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రహానే ఫామ్ పై సర్వత్ర ఆందోళన నెలకొంది. జూన్ 4వ తేదీన ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో రహానే ఏ మేరకు రాణిస్తాడనే డౌట్ అందర్లో ఉంది. ఈ క్రమంలో, పాక్ తో జరిగే కీలకమైన మ్యాచ్ కు రహానేను ఎంపిక చేయద్దని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. ఇండియాకు వచ్చి డొమెస్టిక్ క్రికెట్ ఆడుకోవాలంటూ రహానేపై ట్విట్టర్ లో విరుచుకుపడుతున్నారు. 

  • Loading...

More Telugu News