: దాసరి మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యా.. అలాంటి వ్యక్తి మళ్లీ పుట్టడు: సుబ్బరామిరెడ్డి


దాసరి నారాయణరావు మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సినీ నిర్మాత, రాజకీయవేత్త, వ్యాపారవేత్త టి.సుబ్బరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక మహా దర్శకుడు, నిర్మాత, నటుడు అని కీర్తించారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగానికి కూడా పేరు తీసుకువచ్చిన గొప్ప మనిషి అని అన్నారు. దాసరిలాంటి మరో వ్యక్తిని భవిష్యత్తులో మనం చూడలేమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. దాసరి కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. 

  • Loading...

More Telugu News