: దేశంలోకి చొరబడ్డ 25 మంది లష్కరే ఉగ్రవాదులు... ఏ క్షణమైనా ముంబై తరహా దాడి!
భారతావనిపై విరుచుకుపడి ముంబై తరహా ఉగ్రదాడి చేసేందుకు పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న లష్కరే తోయిబాకు చెందిన 20 నుంచి 25 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సరిహద్దు పట్టణాలు లేదా దేశంలోని ఏదైనా మెట్రో నగరంలో వీరు భయంకర దాడికి దిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, టూరిస్టు ప్రాంతాలు, మాల్స్, హోటళ్లను వీరు టార్గెట్ గా చేసుకోవచ్చని భావిస్తున్నామని అన్నారు. నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రధాన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో భద్రతను మరింతగా పెంచారు. అన్ని నగరాల్లో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్న ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.