: విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. నిన్న మృతిచెందిన దర్శకరత్న దాసరి భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించి, ఆయన కుటుంబానికి సంతాపం తెలిపేందుకు చంద్రబాబు హైదరాబాద్ రానున్న సంగతి తెలిసిందే. దాసరి మృతి చెందిన తరువాత సంతాప సందేశాన్ని విడుదల చేస్తూ, తనకు వివాహం కాకపూర్వం నుంచే ఆయనతో పరిచయం ఉందని చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీ రామారావు మాదిరే తన జీవితాన్ని ఓ క్రమశిక్షణలో గడిపిన మహనీయుడని, ఇటీవలే ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో వెళ్లి పరామర్శించానని చెప్పారు. జన్మభూమి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆయనతో ఓ పాట రాయించాలని తలచగా, ఎంతో శ్రమ పడి మంచి గీతాన్ని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News