: విషాదంలో కన్నడ సినీ పరిశ్రమ.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సతీమణి మృతి


తెలుగు చలనచిత్ర రంగం తన పెద్దదిక్కైన దాసరిని కోల్పోయి విషాదంలో మునిగిపోయిన తరుణంలో... కన్నడ సినీ రంగం సైతం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దిగ్గజ నటుడు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె తెల్లవారుజామున 4.40 గంటలకు కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు.

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 14న ఆమెను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె వెంటిలేటర్ మీదే ఉన్నారు. వైద్యులు ప్రత్యేక శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పటికీ... ఎలాంటి లాభం లేకపోయింది. తన భర్త రాజ్ కుమార్ బాటలోనే పయనించిన పార్వతమ్మ... తన రెండు కళ్లను దానం చేశారు. ఆమె భౌతికకాయానికి పూర్ణ ప్రంగ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

  • Loading...

More Telugu News