: ఉగ్రవాద సంస్థ ఐసిస్ కంటే పుతినే డేంజర్.. అమెరికా సెనేటర్ సంచలన వ్యాఖ్యలు


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా సెనేటర్, ఆర్మ్‌డ్ సర్వీస్ కమిటీ చైర్మన్ అయిన జాన్ మెక్‌ కెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ కంటే ప్రపంచ భద్రతకు పుతిన్ పెనుముప్పుగా మారారని తీవ్రస్థాయిలో ఆరోపించి కలకలం రేపారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్న రష్యాపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. అమెరికా విదేశీ విధానాలపై అమెరికా కాంగ్రెస్‌లో గొంతెత్తే మెక్ కెయిన్ ఆస్ట్రేలియాలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘నాకు తెలిసినంత వరకు ప్రపంచ భద్రతకు ఐసిస్ కంటే పుతిన్ వల్లే ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల్లో పుతిన్ జోక్యంపై ఆధారాలు లేనప్పటికీ ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓటు సహా ఎన్నో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాబట్టి ఆ దేశంపై ఆంక్షలు విధించడంతోపాటు జరిమానా కూడా వేయాల్సి ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News