: రేపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని షూటింగులు, సినిమా పనులు నిలిపివేస్తున్నాం: నిర్మాత సి.కల్యాణ్


దర్శకరత్న దాస‌రి నారాయ‌ణరావు మృతి పట్ల తెలుగు ఫిలిం చాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం ఫెడరేషన్ సంతాపం తెలుపుతోంద‌ని ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఈ రోజు కిమ్స్ ఆసుప‌త్రి వ‌ద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. దాసరి మృతికి సంతాపంగా రేపు తెలుగు చలన చిత్ర పరిశ్రమ బంద్ పాటిస్తుందని ప్ర‌క‌టించారు. రేపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని షూటింగులు, పనులను నిలిపివేస్తున్న‌ట్లు తెలిపారు. దాస‌రి భౌతికకాయాన్ని కిమ్స్ ఆసుప‌త్రి నుంచి ఆయ‌న నివాసానికి త‌ర‌లించారు. కొద్దిసేపటి క్రితం అక్కడకు దాస‌రి భౌతికకాయం చేరుకుంది.

  • Loading...

More Telugu News