: దాసరి మరణ వార్తవిని షాక్ అయ్యా.. ఆయనలేని లోటు తీర్చలేనిది: మహేశ్ బాబు
దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి పట్ల సినీనటుడు మహేశ్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. దాసరి మరణవార్తను తెలుసుకొని షాక్‌కు గురయ్యానని, ఎంతో బాధ కలిగించిందని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. చిత్ర పరిశ్రమలో ఆయన లేని లోటు ఎప్పటికీ, ఎవ్వరూ భర్తీ చేయలేరని అన్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దాసరి మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విప్లవాత్మక, కుటుంబ, సందేశాత్మక కథా చిత్రాలను తీసిన దాసరి ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేపోతున్నారు.
Shocked and saddened by the news of Dasari Narayana Rao Garu's passing away. May his soul rest in peace.
— Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2017
His death leaves a void that can never be filled. Prayers and strength with the whole family.
— Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2017