: దాసరి మృతి పట్ల సినీనటులు రజనీకాంత్, కమలహాసన్ దిగ్భ్రాంతి


దర్శకరత్న దాస‌రి నారాయ‌ణరావు మృతి పట్ల సినీనటులు రజనీకాంత్, కమలహాసన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాసరి నారాయణరావు తనకు ఆత్మీయుడు, స్నేహితుడని రజనీకాంత్ అన్నారు. దేశంలోని గొప్ప దర్శకుల్లో దాసరి ఒకరని, ఆయ‌న లేని లోటు తీర్చ‌లేనిద‌ని అన్నారు. దాస‌రి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్న‌ట్లు చెప్పారు. సినీన‌టుడు క‌మ‌ల‌హాస‌న్ స్పందిస్తూ... దాస‌రి మృతి ప‌ట్ల సంతాపం తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. గ‌తంలో దాస‌రితో గ‌డిపిన రోజులు గుర్తు చేసుకుంటుంటే బాధ‌గా ఉంద‌ని అన్నారు. దాస‌రి లేక‌పోవ‌డం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌నిలోట‌ని పేర్కొన్నారు.  















  • Loading...

More Telugu News