: 'నాకు నటుడిగా జన్మినిచ్చారు..' అంటూ తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకొని మాట్లాడలేకపోయిన మోహన్ బాబు!
దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి చెందారన్న వార్తను ఆయన శిష్యుడు, సినీనటుడు మోహన్‌బాబు జీర్ణించుకోలేకపోతున్నారు. దాసరి మరణవార్త వినగానే ఆసుపత్రికి వచ్చిన మోహన్ బాబు మీడియా ముందే విలపించారు. ‘ఒక చరిత్ర ముగిసిపోయింది.. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఆయన సేవలు మర్చిపోలేనివి.. నాకు నటుడిగా జన్మనిచ్చారు...’ అంటూ ఏదో చెప్పబోతూనే ఉద్వేగంతో కన్నీరు పెట్టుకొని మాట్లాడలేకపోయారు.