: దర్శకరత్న దాసరి నారాయణరావు ఇకలేరు!


ప్ర‌ముఖ‌ సినీ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ రావు(75) కన్నుమూశారు. గత నాలుగురోజులుగా ఆయ‌న హైద‌రాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దాస‌రికి ఐసీయూలో చికిత్స అందుతోందని వైద్యులు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన మరణించారన్న వార్త వచ్చింది. దాసరి అన్నవాహిక దెబ్బ‌తిన‌డంతో గొంతు నుంచి జీర్ణాశ‌యం వ‌ర‌కు వైద్యులు చికిత్స అందించారు. ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా ఆయ‌న‌ ప‌రిస్థితి విష‌మంగా మారింది. ఈ రోజు సాయంత్రం ఆయ‌న మృతి చెందార‌ని దాసరి సన్నిహితులు ప్ర‌క‌టించారు.         

  • Loading...

More Telugu News