: 'ఉషా'పతిగా సంతోషంగా ఉన్నా... రాష్ట్రపతి అవ్వాలని లేదు: వెంకయ్యనాయుడు
భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో, కొత్త రాష్ట్రపతి అభ్యర్థి విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి పేరు కూడా మీడియాలో కనిపిస్తోంది. దీంతో, వెంకయ్యనాయుడు దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ తనకు రాష్ట్రపతి కానీ, ఉప రాష్ట్రపతి కానీ కావాలనే కోరిక ఎంతమాత్రం లేదని...ఉషాపతిగా చాలా సంతోషంగా ఉన్నానని చమత్కరించారు. వెంకయ్యనాయుడి సతీమణి పేరు ఉష అనే విషయం తెలిసిందే. దక్షాణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ... దక్షిణాదివారైన వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా తెరపైకి తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తోందట. దీంతో ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగానో, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగానో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.