: జనసేన సైనికుల ఎంపికలపై మరో ప్రకటన చేసిన పవన్ కల్యాణ్
సామాజిక స్పృహ, వాగ్ధాటి, సామాజిక అంశాల గురించి విశ్లేషణలు చేయగల నైపుణ్యాలు ఉన్న యువత కోసం జనసేన పార్టీ అధినేత, పవన్ కల్యాణ్ ఎంపికలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉత్తరాంధ్ర, గ్రేటర్ హైదరాబాద్‌లలో ఈ ప్రక్రియ ముగిసింది. ఇక తాము మరో ఐదు జిల్లాల్లో ఎంపికలు చేయనున్నామని ఈ రోజు పవన్ కల్యాణ్ మరో ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఆదిలాబాద్ (పాతజిల్లా పరిధి), నిజామాబాద్ (పాత జిల్లా పరిధి), తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఉత్సాహవంతమైన యువత తమ దరఖాస్తులను పంపవచ్చని పవన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం పై ప్రకటనను చూడవచ్చు.