: లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు


స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్‌ 50 పాయింట్లు లాభపడి 31,159 తాజా గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 9,625 రికార్డు స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ప్ర‌భావంతో ఈ రోజు దేశీయ సూచీలు కొత్త రికార్డులను లిఖించాయని విశ్లేష‌కులు పేర్కొన్నారు. త్రైమాసిక ఫలితాలతో పాటు రుతుపవనాలు ముందుగానే వస్తుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చిందని అంటున్నారు. ఇక‌ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.64.62గా ఉంది.

బీఎస్ఈలో ఇవాళ్టి టాప్ గెయినర్స్:
  అరబిందో ఫార్మా, అదానీపోర్ట్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎన్టీపీసీ, టెక్‌ మహీంద్రా

లూజర్స్:
పవర్‌గ్రిడ్‌, భారత్‌ పెట్రోలియం, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ లిమిటెడ్

  • Loading...

More Telugu News