: తిరుమలలో బీభత్సం సృష్టిస్తున్న‌ ఈదురుగాలులు.. త‌ప్పిన పెను ప్ర‌మాదం


తిరుమలలో వీస్తున్న ఈదురుగాలుల వ‌ల్ల స్థానికులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈదురుగాలుల‌తో అక్క‌డి ఘాట్ రోడ్డులో భారీ బండరాయి విరిగిపడింది. అయితే, ఆ స‌మ‌యంలో ఆ ప్రాంతంలో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. తిరుపతి నుండి తిరుమలకు ప్రయాణించే ఎగువ ఘాట్ రోడ్డుకి స‌మీపంలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. బండరాయి ప‌డ‌డంతో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇనుప కంచె విరిగిపోయింది. ప్ర‌స్తుతం ఆ బండరాళ్లను సంబంధిత‌ సిబ్బంది తొలగిస్తున్నారు.                

  • Loading...

More Telugu News