: జర్మనీ పర్యటనలో ఉన్న మోదీని కలిసిన బాలీవుడ్ భామ!


భారత ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బెర్లిన్ లో ఉన్న ఆయనను బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా కలిసింది. తన హాలీవుడ్ సినిమా 'బేవాచ్' ప్రమోషన్ కోసం ప్రియాంక కూడా బెర్లిన్ లోనే ఉంది. దీంతో, ప్రధానిని ఆమె మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా ప్రధానితో కలిసి దిగిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె అప్ లోడ్ చేసింది. "నరేంద్ర మోదీ సార్, ఈ ఉదయం నా కోసం కొంచెం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News