: ఎమ్మెల్యే భార్యను కూడా పట్టించుకోని ప్రభుత్వాసుపత్రి సిబ్బంది
సామాన్య ప్రజలు ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో తెలిపేలా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఎమ్మెల్యే భార్య ఓ పేషెంట్‌ను తీసుకొని ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆమె ఎవరో తెలిసి కూడా ఆమె తీసుకొచ్చిన పేషెంట్ పట్ల అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆమే స్వయంగా వీల్‌ఛైర్‌పై పేషెంట్‌ను తీసుకొచ్చి అతడిని కూర్చోబెట్టి ఆస్పత్రిలోనికి తీసుకెళ్లారు.
ఓ ఎమ్మెల్యే భార్యను కూడా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోతే ఇక సామాన్యుడిపై ఆసుపత్రి సిబ్బంది తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని ఆ ఆసుపత్రిలోని రోగుల బంధువులు అంటున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత తన సోదరుడి కుమారుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకురాగా ఆమెకు ఈ అనుభవం ఎదురైంది. ఈ ఘటనపై ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రి అధికారులు, సిబ్బంది స్పందించలేదు.