: నోటికి నల్లగుడ్డ కట్టుకొని.. ప్లకార్డులు పట్టుకొని వీడియో పోస్ట్ చేసిన గౌతం గంభీర్
నోటికి నల్లగుడ్డ కట్టుకొని.. పలు ప్లకార్డులు పట్టుకొని టీమిండియా ఆటగాడు గౌతం గంభీర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘ఝీజాక్ కి పట్టీ’ (మొహమాటపు గంతలు) అనే పేరుపెట్టి పోస్ట్ చేసిన ఈ వీడియో ద్వారా సుక్మా అమరుల కుటుంబానికి చెందిన చిన్నారుల చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని గంభీర్ గొప్ప ప్రకటన చేశాడు. ప్రజలు మొహమాటమనే పట్టీని కట్టుకున్నారని, జవాన్లపై అసలు ప్రజలకి ప్రేమాభిమానాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించాడు. 'ఎప్పుడైనా జవాన్ ఎదురుపడితే సెల్యూట్ చేశారా? చెప్పలేదు కదా! ఎందుకు? ఎందుకంటే.. మొహమాటం మరి' అని ఆయన ప్లకార్డుల్లో పేర్కొన్నాడు.
చివరికి తన ముఖానికి కట్టుకున్న పట్టీని తీసేసి, ఇకపై ప్రజలు కూడా తమలో ఉన్న మొహమాటపు పట్టీ తీసేయాలని గంభీర్ సందేశమిచ్చాడు. జవాన్ కనిపిస్తే కరచాలనం చేయాలని, సెల్ఫీ తీసుకోవాలని ఆయన కోరాడు. ఈ వీడియోపై అభిమానుల నుంచి భారీగా స్పందన వస్తోంది.
I have stepped out of my crease. Will you? @FeverFMOfficial @majorgauravarya @narendramodi @PMOIndia #BharatPositive pic.twitter.com/h8WZSJqCgx
— Gautam Gambhir (@GautamGambhir) 29 May 2017