: మియాపూర్ భూ కుంభకోణంపై సీఐడీ విచారణకు ఆదేశించిన కేసీఆర్


హైదరాబాద్ మియాపూర్ లో చోటుచేసుకున్న భారీ భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. భూ కుంభకోణంపై సమీక్ష నిర్వహించిన ఆయన... రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలంటూ సీఐడీని ఆదేశించారు. ఇందులో ఉన్న నిందితులు ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు రిజిస్ట్రేషన్ చట్టంలోని లొసుగులకు చెక్ పెట్టాలని సూచించారు. ఎక్కడ నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు ఈ కేసులో నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. ఇదే సమయంలో బెయిల్ కోసం నిందితులు పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అయితే ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఆయన తన భార్య, కోడలు, కుటుంబసభ్యుల పేరుతో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించినట్టు పోలీసులు గుర్తించారు. 

  • Loading...

More Telugu News