: తుపాకీ లైసెన్స్ రెన్యువల్ చేయాలని కోరుతున్నా.. పట్టించుకోవడం లేదు: వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి
తన తుపాకీ లైసెన్సును రెన్యువల్ చేయాలని గడువుకు 25 రోజుల ముందే దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు ఇంతవరకు స్పందించలేదని గుంతకల్లు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గడువుకు ముందే దరఖాస్తు చేసుకున్నప్పటికీ లైసెన్స్ ను ఎందుకు రెన్యువల్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యం సరికాదని అన్నారు. వెంటనే గన్ లైసెన్స్ ను పునరుద్ధరించాలని కోరారు.