: హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ సీరియస్ వార్నింగ్!
నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీరియన్ వార్నింగ్ ఇచ్చింది. ఇకపై ఎవరైనా సరే పొరపాటుగానో లేదా ఉద్దేశపూర్వకంగానో రోడ్లను తవ్వితే... తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. రోడ్లను తవ్విన వారిపై కేసులు పెడతామని... ఇది జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంతేకాదు, రోడ్లను తవ్వడానికి కూడా ఇకపై అనుమతి ఇవ్వబోమని చెప్పారు. పలు ప్రాంతాల్లో రోడ్లను తవ్వేశారని... జూన్ 10వ తేదీలోగా తవ్విన రోడ్లను పునరుద్ధరించాలని జలమండలిని ఆయన ఆదేశించారు.