: భోపాల్‌లో కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిన్న రాత్రి జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. అంతేగాక, ఈ రోజు కూడా అటువంటి ఫోన్‌కాలే వచ్చి అలజడి రేపుతోంది. ఈ రోజు షాపింగ్‌మాల్, మారియట్ హోటల్‌లలో బాంబులు పెట్టినట్టు తమకు కాల్స్ వచ్చాయని అక్కడి పోలీసులు తెలిపారు. భోపాల్‌లోని డీబీ సిటీ మాల్‌తో పాటు మారియట్ హోటల్‌లలో బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
నిన్న రాత్రి 9 గంటల సమయంలోనూ బెదిరింపు కాల్ రావడంతో జిల్లా కోర్టు వద్ద తనిఖీలు చేసిన పోలీసులు.. అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు. వరుసగా రెండు రోజులు ఇటువంటి ఫోన్‌కాల్సే రావడంతో అక్కడి ప్రజలకు ఆందోళన చెందుతున్నారు.