: మహేశ్ బాబు 'స్పైడర్' టీజర్ విడుదల నేడు కాదు రేపు!


టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సెంటిమెంట్ బ్రేక్ అయింది. మహేశ్ బాబు సినిమాల్లోకి వచ్చిన కొంత కాలం తరువాత తన తండ్రి కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని తన సినిమాకు సంబంధించిన 'టీజర్' లేదా 'ట్రైలర్' అదీ కాకపోతే 'ఫస్ట్ లుక్' ఇలా ఏదోఒకటి విడుదల చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. చాలా కాలంగా మహేశ్ బాబు ఈ సెంటిమెంటును పాటించాడు. తాజాగా తన తండ్రి పుట్టిన రోజును పురస్కరించుకుని సాయంత్రం 5 గంటలకు తన తాజా సినిమా 'స్పైడర్' సినిమా టీజర్‌ విడుదల చేయనున్నామని మహేశ్ బాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.

 అయితే టీజర్ కటింగ్ ఇంకా పూర్తి కాలేదని, దీంతో రేపు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నామని చిత్రబృందం తెలిపింది. కాగా, తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్వీఆర్ సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, దీనికి సంగీతం హరీష్ జైరాజ్ అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News