: అద్వానీ, ఉమ సహా బాబ్రీ కేసు నిందితులకు బెయిల్


బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో ఈ ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి బెయిల్ లభించింది. ఆయనతో పాటు మరో 11 మందికి కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ ఉదయం అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కతియార్ తదితరులు కోర్టుకు హాజరు కాగా, వీరందరికీ బెయిల్ ఇస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. కాగా, ఈ కేసును గరిష్ఠంగా రెండు సంవత్సరాల్లో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో భాగంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును బీజేపీ నేతలు కోరినప్పటికీ, కోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్ల మధ్య అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలంతా కోర్టుకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News