: ఛీ ఛీ.. స్పైస్ జెట్ విమానం: మాజీ మిస్ ఇండియా, సినీ నటి రూహి సింగ్ ఆగ్రహం


'ఛీ ఛీ... స్పైస్ జెట్ ఫ్లైట్' అంటూ మాజీ మిస్ ఇండియా, సినీ నటి రూహి సింగ్ చీదరించుకుంటోంది. తమిళ సినిమా ప్రమోషన్ లో పాల్గొనేందుకు చెన్నై వెళ్లిన రూహి సింగ్ స్పైస్ జెట్ లో తనకు ఎదురైన ఊహించని అనుభవం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రశాంతమైన ప్రయాణాన్ని ఆశించి, ఎక్కువ డబ్బు చెల్లించిమరీ స్పైస్‌ మాక్స్ సీటు కొనుగోలు చేశానని రూహి సింగ్ తెలిపింది.

 అయితే అందుకు భిన్నంగా తాను ఓ బల్లి పక్కన కూర్చొని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చిందని వాపోయింది. తన సీటు కింద నుంచి వచ్చిన బల్లి, తన విండో పక్కన కాసేపు చక్కర్లు కొట్టి, లగేజ్ క్యాబిన్ లోపలికి వెళ్లిపోయిందని తెలిపింది. దీనిపై విమాన సిబ్బందికి తెలిపితే సాధారణ ఘటనగా పేర్కొని నవ్వుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. విమానంలోని పరిశుభ్రత ప్రమాణాలు తనను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని తెలిపింది. అంతేకాకుండా సీటు మారమని సూచించారని వెల్లడించింది. మాధుర్‌ బండార్కర్‌ తీసిన ‘క్యాలెండర్‌ గర్ల్స్‌’  సినిమాతో బాలీవుడ్‌ కు పరిచయమైన రూహి సింగ్ ప్రస్తుతం కోలీవుడ్ లో ఓ సినిమాలో నటించింది. కాగా, ఆమె ఆరోపణలపై స్పైస్‌ జెట్‌ ఇంకా స్పందించాల్సి ఉంది.



A post shared by Ruhi Singh (@ruhisingh12) on


  • Loading...

More Telugu News