: ఇలాంటి వదంతులు కూడా పుట్టిస్తున్నారా?: నటి నిత్యామీనన్


చక్కటి అభినయంతో సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. అయితే ఈ అమ్మడు గురించిన ఓ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిత్యామీనన్ కు నటనపై ఆసక్తి తగ్గిందని, దర్శకత్వంపై ఆమెకు మోజు పుట్టిందని, అందుకే నటిగా అవకాశాలను కూడా తిరస్కరిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై నిత్య స్పందించింది. దర్శకత్వం చేస్తానని తాను ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదని... ఇలాంటి ప్రచారాలు కూడా చేస్తారా? అని ప్రశ్నించింది. ఛాలెంజింగ్ పాత్రలు చేయాలన్న కోరిక తనలో ఇంకా ఉందని చెప్పింది. ఏదేమైనప్పటికీ తనను దర్శకురాలిగా చూడాలని చాలా మంది ఎదురుచూస్తుండటం... తనకు సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపింది. భవిష్యత్తులో దర్శకత్వం గురించి ఆలోచిస్తానని చెప్పింది. ప్రస్తుతం కోలీవుడ్ హీరో విజయ్ సినిమాలో నిత్యామీనన్ నటిస్తోంది. 

  • Loading...

More Telugu News