: చైనాలో సక్సెస్ అవుతుందనుకున్నా కానీ, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించలేదు: అమీర్ ఖాన్


చైనాలో 'దంగల్' మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. భారత్ లో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా, చైనాలో కూడా విడుదలై అక్కడ కూడా ఊహించని ఆదరణను సొంతం చేసుకుంది. భారత్ కంటే చైనాలో ఎక్కువ వసూళ్లు సాధించి రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటికే 'బాహుబలి2' రికార్డును అధిగమించిన 'దంగల్' మరిన్ని వసూళ్లు సాధిస్తూ ఆకట్టుకుంటోంది.

ఈ భారీ విజయంపై అమీర్ ఖాన్ హర్షం వ్యక్తం చేస్తూ, చైనాలో 'దంగల్‌' చేసిన బిజినెస్‌ తో సర్‌ప్రైజ్‌ అయ్యామని చెప్పాడు. చైనావాసులకి ఈ సినిమా నచ్చుతుందని ఊహించినప్పటికీ, ఈ స్థాయిలో నచ్చుతుందని భావించలేదని తెలిపాడు. ఈ సినిమా చైనాలో ఇంత పెద్ద సక్సెస్ ను చవిచూస్తుందని భావించలేదని అమీర్ పేర్కొన్నాడు. అయితే సృజనాత్మకత ఉంటే భాషతో పనిలేదన్న సూత్రాన్ని చైనాలో 'దంగల్' నిరూపించిందని అమీర్ తెలిపాడు.

  • Loading...

More Telugu News