: 15 ఏళ్ల తరువాత రామజన్మభూమికి వస్తున్న ఓ సీఎం!


కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరు తెచ్చుకుని, కొద్దికాలం క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్, కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ఆయన అయోధ్యకు వెళ్లి, రామజన్మభూమిలోని తాత్కాలిక ఆలయంలో ప్రత్యేక పూజలు జరపనున్నారు. దీంతో 15 సంవత్సరాల తరువాత రామజన్మభూమిని సందర్శిస్తున్న ఓ ముఖ్యమంత్రిగా ఆయన నిలవనున్నారు. 2002లో అప్పటి యూపీ సీఎం రాజ్ నాథ్ సింగ్ అయోధ్యను సందర్శించగా, ఆపై మరెవరూ అంత ధైర్యం చేయలేకపోయారు.

రామజన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ జయంతి వేడుకలు రేపు జరగనుండగా, వాటిల్లో పాల్గొనేందుకు యోగి అయోధ్యకు రానున్నారు. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన అనంతరం... ఫజియాబాద్ - అయోధ్య డివిజన్ పై జరిగే సమీక్షలోనూ ఆదిత్యనాథ్ పాల్గొంటారని తెలుస్తోంది. రేపు ఉదయం 8:35కు ఫజియాబాద్ కు వచ్చే ఆయన దాదాపు 8 గంటల పాటు ఈ ప్రాంతంలోనే ఉంటారు. హనుమాన్ గర్హి, సరయూ ఘాట్, దిగంబర్ అఖాడా తదితర యాత్రా స్థలాలను సందర్శిస్తారు.

  • Loading...

More Telugu News