: 'విశ్వసనీయ వర్గాలు చెప్పాయి' అంటూ అబద్ధాలు చెబుతున్నారు: ట్రంప్
అమెరికా మీడియాపై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ మరోసారి ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో నిజంగా ఏం జరుగుతోందో తెలుసుకోవడం ఇక్కడి మీడియా సంస్థలకు ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు. సరైన ఆధారాలు లేకుండానే... 'విశ్వసనీయ వర్గాలు చెప్పాయి' అంటూ అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ మీడియా ప్రతినిధులపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించి కూడా అసత్యాలను ప్రచారం చేయడం దారుణమని విమర్శించారు. నకిలీ న్యూస్ రైటర్సే ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన అల్లుడు జారెడ్ కుష్ నర్ రష్యా రాయబారితో జరిపిన భేటీపై మీడియాలో వ్యతిరేక కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.