: మహిళా జూ కీపర్ పై దాడి చేసి చంపిన పెద్దపులి... బ్రిటన్ లో ఘోరం


లండన్ లోని హామెర్టన్ జూ పార్కులో ఘోరం జరిగింది. ఓ పెద్దపులిని తీసుకుని ఎన్ క్లోజర్ లోకి వెళ్లిన మహిళా జూ కీపర్ పై అది దాడికి దిగి చంపేసింది. కేంబ్రిడ్జ్ షైర్ కౌంటీ పరిధిలోని జూలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దపులి చేతిలో జూ కీపర్ మరణించడం చాలా దురదృష్టకరమని, పూర్తి విచారణకు ఆదేశించామని, పూర్తి వివరాలు నివేదిక వచ్చిన తరువాత చెబుతామని హామెర్టన్ జూ నిర్వాహకులు తమ ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించారు. గతంలో ఇటువంటి ఘటనలు జరగలేదని తెలిపారు. కాగా, 25 ఎకరాలలో ఉన్న ఈ జూలో మలేషియన్, బెంగాల్ టైగర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News