: న్యూడ్ సీన్స్ ఉంటాయి... కానీ సందర్భానుసారమే!: 'గన్స్ అండ్ థైస్'పై రాంగోపాల్ వర్మ


దర్శకుడు రాంగోపాల్ వర్మ తయారు చేస్తున్న 'గన్స్ అండ్ థైస్' వెబ్ సిరీస్ ట్రయిలర్ కలకలం రేపుతుండగా, ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను వెల్లడించాడు. వెబ్ చానల్ అయితే, సెన్సారింగ్ ఉండదని, ఎంత సమయం పాటు చూపుతున్నామన్న దానికి పరిధులు ఉండవని వర్మ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ లోని న్యూడ్ సీన్లలో కొన్ని ట్రయిలర్ లో చూపడంపై స్పందిస్తూ, పాతికేళ్ల క్రితమే శేఖర్ కపూర్ 'బండిట్ క్వీన్' చిత్రంలో పూలన్ దేవిని నగ్నంగా చూపించారని, ఆ సీన్ చిత్రానికే హైలైట్ గా నిలిచిందని గుర్తు చేశాడు. తన సిరీస్ లోనూ సందర్భానుసారం కొన్ని దృశ్యాలు ఉంటాయని అన్నాడు. ముంబై మాఫియా గురించి తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెప్పాడు. ట్విట్టర్ లో బోర్ కొట్టినందుకే తాను దాన్ని వదిలేశానని వెల్లడించాడు. ఇకపై ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో టచ్ లో ఉంటానని చెప్పాడు.

  • Loading...

More Telugu News