: భార్యను వేధిస్తున్న ఎన్నారైను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు


వినోద్ కుమార్ అనే ఎన్నారైను హైదరాబాద్ మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నగరంలోని మౌలాలి గాయత్రి నగర్ కు చెందిన వాణిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే వినోద్ కుమార్ హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. గత కొంత కాలంగా భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, విడాకులు ఇవ్వాలంటూ అతను భార్యపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. భర్త ఆగడాలను భరించలేకపోయిన వాణి... మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు... వినోద్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.


  • Loading...

More Telugu News