: అచ్చం చిన్నారి శ్రీదేవి!.... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!


టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా వెలిగిన శ్రీదేవికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. బాలనటిగా తెలుగు, తమిళ తెరల్ని అలరించిన శ్రీదేవి పసిపాపగా ఎలా ఉండేదో మనకు తెలియదు. అయితే ఇప్పుడు అచ్చం శ్రీదేవిలా ఉన్న ఒక పసిపాప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కళ్లు.. హావభావాలు అచ్చం చిన్నారి శ్రీదేవిని గుర్తు తెస్తున్నాయి. పొత్తిళ్లలో బుజ్జాయి బెదిరిపోతుండడంతో వీడియో తీసిన వ్యక్తిపై నెటిజన్లు మండిపడుతున్నారు. పాప శ్రీదేవిలా ఉన్నా బెదిరించడం ఎందుకు? ముందా కెమెరా ఆఫ్ చెయ్ అంటూ కామెంట్లలో సూచిస్తున్నారు.


  • Loading...

More Telugu News