: జీఎస్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్


జీఎస్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి వస్తే, ఆన్ లైన్ ద్వారా కూడా మందుల విక్రయం ప్రారంభమవుతుంది. దీంతో ఆన్ లైన్ లో మందుల విక్రయానికి వ్యతిరేకంగా మెడికల్ షాపులు బంద్ నిర్వహిస్తున్నాయి. బంద్ కారణంగా రిటైల్, హోల్ సేల్ మెడికల్ షాపులు మూతపడ్డాయి. హోల్ సేల్, రిటైల్ లో అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటుందని, ఆన్ లైన్ లో అయితే ఎవరైనా ఏ మందు అయినా కోనుగోలు చేయవచ్చని వారు ఆరోపిస్తున్నారు. అలాగే జనరిక్ మెడిసన్ ను ముందుగా ప్రిస్క్రైబ్ చేయాలన్న నిబంధనను వైద్యులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఆన్ లైన్ లో ఉంచే మందుల వివరాలు అస్పష్టంగా ఉంటున్నాయని, వాటిని స్పష్టంగా పేర్కొనాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News